డాక్టర్ బాబు, వంటలక్కల కార్తీకదీపం కొత్త ప్రోమో చూశారా!
on Feb 25, 2024
ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ వస్తుందా అని ఎదురుచూసే బుల్లితెర ధారావాహిక అభిమానులకి ఊరటగా ' కార్తీకదీపం ' కొత్త ప్రోమో రానే వచ్చింది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క కన్పించడంతో ఈ సెకెండ్ పార్ట్ లో వీళ్ళిద్దరు ఉన్నారని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి ప్రోమోలో శౌర్య చెప్పిన కథ విని వాళ్ళ నాన్న లేడేమో అనుకున్నారంతా.. కానీ డాక్టర్ బాబుని చూపించి ఈ సీరియల్ పై మరిన్ని అంచనాలు పెంచేశారు మేకర్స్.
మొదటి ప్రోమోలో శౌర్య చెప్పిన కథ విని ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క ఎవరు ఉండరేమో అని అనుకోగా.. తాజాగా కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో ఏం ఉందంటే.. శౌర్య పాప ఓ బొమ్మ పట్టుకొని "మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం.. నన్ను ఎప్పుడూ కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నారు. నాన్న నా కోసం ఎంత కష్టపడతారో, మా నాన్న ఎంత గొప్పోడో" అంటూ గొప్పలు చెబుతుంది. ఇంతలో శౌర్య పాప దగ్గరికి వచ్చి "మీ నాన్న బాగా తెలుసున్నట్లుగా మాట్లాడుతున్నావ్.. ఇంతకుముందు ఎక్కడున్నాడో తెలీదన్నావ్.. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడు" అంటూ డాక్టర్ బాబు అడిగాడు. దీనికి వంటలక్కను చూపిస్తుంది శౌర్య పాప. నాకు అమ్మైనా, నాన్నైనా మా అమ్మే.. కానీ నాన్న కూడా ఉంటే బావుంటుందంటూ శౌర్య చెబుతుంది. ఇంతలో ఇంట్లో పనులన్నీ అయిపోయాయ్ బాబు గారు.. మేము ఇంక వెళ్తామంటూ డాక్టర్ బాబుతో చెప్పేసి వంటలక్క బయలుదేరుతుంది.
కార్తీకదీపం సీరియల్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఈ సెకెండ్ పార్ట్ లో డాక్టర్ బాబు, వంటలక్కల బంధం అలాగే ఉందా? లేక ఇది మరో జన్మలా మేకర్స్ చూపించనున్నారా.. ఏదైతేనేం ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరున్నారు. ఇది సరిపోద్ది అని అనుకునేవాళ్ళు చాలా మందే ఉన్నారు. మరి ఈ సీరియల్ ఎలా మొదలవుతుంది? ఎప్పుడు మొదలవుతుందనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
